ఆరూరిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా బిగ్ ట్విస్ట్!

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పొలిటికల్ స్టెప్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆరూరిని హనుమకొండలోని ఆయన ఇంటి నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌కు తరలిస్తుండగా బుధవారం మధ్యాహ్నం జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు..దయాకర్ రావు కారును అడ్డుకుని ఆరూరి రమేష్‌ను బీజేపీ శ్రేణులు వారి వాహనంలో ఎక్కించుకొని హైదరాబాదుకు బయలుదేరారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వద్దకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డితో పాటుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా కంగుpతిన్నారు..