సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదు తెలంగాణ ఉద్యమం. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు”…జీవన్ రెడ్డి.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గురించి మాట్లాడే ముందు తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతో ఏర్పడలేదని, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగానే సాధ్యమైందని అన్నారు. “తెలంగాణ ముమ్మాటికీ ఈ నేలపై నివసిస్తున్న నాలుగు కోట్ల ప్రజలది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.
సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదు తెలంగాణ ఉద్యమం. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణ సాధనలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్రను కొనియాడుతూ, ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. “తెలంగాణకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఎవరైనా ఉంటే అది ఒక్క కేసీఆరే.
తెలంగాణ అనే సినిమాను సృష్టించి భారతదేశ పటంలో గర్వంగా నిలబెట్టిన గాడ్ఫాదర్ కేసీఆర్” అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని, ఇతర ప్రాంతాల రాజకీయ ప్రభావంతో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ వ్యాఖ్యనైనా బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు… ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు అందరూ తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతు షిండే, గణేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.