విషాదం గల్లంతైన ఏడుగురు భారత సైనికులు మృతి…

R9TELUGUNEWS.COM : అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికుల ఘటన విషాదకరంగా ముగిసింది. ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం నిర్ధరించింది…కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఎత్తైన ప్రాంతమైన కమెంగ్‌ సెక్టార్‌లో ఆదివారం సైనికులు పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సమాచారం తెలియగానే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించి.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. తాజాగా వారి మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు.