జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోజవాన్లతో ప్రధాని దీపావళి వేడుకలు..

దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గురువారం ప్రధాని దీపావళి వేడుకలను జవాన్లతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. అనంతరం సైనికులనుద్దేశించి మాట్లాడారు. సైనికుల కోసం 130కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకువచ్చానని, తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు. సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు. ప్రతి దీపావళి సైనికులతోనే జరుపుకుంటున్నానని.. జవాన్ల మధ్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.