ఘోర ప్రమాదం.. 8 మంది భారత జవాన్లు మృతి..

*ఘోర ప్రమాదం.. 8 మంది భారత జవాన్లు మృతి*

*లద్దాఖ్..

లద్దాఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది.

భేరి ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో 8 మంది జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో 10 మంది భారత సైనికులు ఉన్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు…చనిపోయిన 9 మందిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తోపాటు మరో 8 మంది జవాన్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఘటన సమయంలో వాహనంలో 10 మంది ప్రయాణిస్తుండగా.. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. దీంతో గాయపడిన ఆ ఒక్క సైనికుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 10 మంది జవాన్లు సైనిక వాహనంలో కేరే గ్యారిసన్ నుంచి లేహ్ సమీంపంలోని ఖేరీకి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం.. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయినట్లు తెలిపారు. అంత ఎత్తు నుంచి సైనిక వాహనం పడిపోవడంతో 10 మందిలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

సైనికులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భారత సైన్యం, ఇతర స్థానిక బలగాలను హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపించారు. ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయడం, మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ గుర్తించడం, వాహనాన్ని పైకి లాగడం చేస్తున్నారు. అయితే ఎవరెవరు చనిపోయారు.. వారి వివరాలేంటి అనే విషయాలు ఇంకా ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించలేదు.