అరుణాచల్ ప్రదేశ్ మార్కెట్ లో అగ్నిప్రమాదం 700 దుకాణాలు దగ్ధం..!!

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పై గా దుకాణాలు కాలిబుడిదయ్యాయని పోలీసులు తెలిపారు.అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఆరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు.