ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భద్రతపై పార్లమెంట్లో ప్రకటన, ఒవైసీకి ఇంకా ముప్పు పొంచి ఉంది…..కేంద్ర హోం మంత్రి అమిత్షా….

R9TELUGUNEWS.COM..హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భద్రతపై పార్లమెంట్​లో ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​షా. ఒవైసీకి ఇంకా ముప్పు ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు వెల్లడిచారు. Lఈ కారణంగా ఆయన.. ప్రభుత్వ ఇటీవల కేటాయించిన Z క్యాటగిరీ సెక్యూరిటీని అంగీకరించాలని కోరారు..రాజ్య సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన అమిత్ షా. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 3న ఒవైసీ కారుపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలతో ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఆయన కారుపై మాత్రమే మూడు బుల్లెట్​ గుర్తులు పడ్డట్లు వివరించారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

అసలు ఏమైందంటే..

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అభ్యర్థి తరఫున మీరఠ్​లో ప్రచారం కోసం వెళ్లారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న ఆయన కారుపై హాపూర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటనతో ఒక్క సారిగా హోం శాఖ అప్రమత్తమైంది. ఒవైసీకి భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరునాడే ఆయనకు Z సెక్యూరిటీ భద్రతను ఇస్తున్నట్లు ప్రకటించింది.
అయితే కేంద్రం ప్రకటించిన Z సెక్యూరిటీని అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తాను సామాన్యులతోనే ఉంటానని.. వాళ్లు సేఫ్​గా ఉన్నప్పుడే తాను సురక్షితమన్నారు.
ఈ పరిణామాల నేఫథ్యంలో ఒవైసీకి ఇంకా ముప్పు పొంచి ఉందని.. అందుకే భద్రత పెంపునకు అంగీకరించాలని కోరుతూ హోం మంత్రి అమిత్ షా రాజ్య సభలో కోరారు.