నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly:
హైదరాబాద్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది..

ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాల ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేయనున్నారు..

నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాలే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో సాగునీరు అందించకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకే ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపిస్తోంది. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం లిఫ్టు పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడం వంటి అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచిన విషయం తెలిసిందే..

*🔹తెలంగాణ మూడవ అసెంబ్లీ*

*• సెకండ్ సెషన్ ఏడవరోజు అసెంబ్లీ సమావేశాలు.*

_• నేడు శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం._

_నిన్న శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది._

*• అసెంబ్లీ బిజినెస్*

_1) ప్రభుత్వ రిజల్యూషన్_

(కులనణన తీర్మానం)

_2) స్వల్పకాలిక చర్చ._

(రాష్ట్రంలో నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం)

*🔹శాసనసభలో నేడు కులగణన పై తీర్మానం*.

_• నిన్న సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన సర్కార్,_

_• ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా._

_• ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కుల గణన తీర్మానం పెట్టనున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,_

_• బీసీ కులగణనపై ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ._

_• బీసీ లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ_

_బీహార్ తరహాలో సమగ్ర కులగణన చేయాలని కోరుతున్న బీసీ సంఘాలు._

_ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పూర్తికావస్తున్న కులగణన_

_జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం ఆయా వర్గాల గురు రిజర్వేషన్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం_

_దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కోట 50% సీలింగ్ ఎత్తివేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ_

_బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కులగణన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ._

_న్యాయవివాదాల్లో చిక్కుకోకుండా క్యాస్ట్ సెన్సెస్ పూర్తి చేయాలని కోరుతున్న బిసినేతలు._

*⭕ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న ప్రభుత్వం*

_ఇప్పటికే రాష్ట్రంలో హాట్ హాట్ గా సాగుతున్న వాటర్ పాలిటిక్స్._

_KRMB పై బిఆర్ఎస్…_

_గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు._

_నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ శ్వేత పత్రం పై జరిగే చర్చ మరింత పొలిటికల్ హిట్ పెంచనుంది._

_నిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్టులో పలు లోపాలు ఎత్తి చూపింది._

_నేటితో అసెంబ్లీ సమీవేశాలు వాయిదా పడే అవకాశం.