మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు…

మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు….కాగా రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. మార్చి 7 వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు.