అసెంబ్లీ గేటు ముందు బైఠాయించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసు కుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు.

అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధన ఉందని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్ల వద్ద ఆగిపోయారు.

కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభలో అవకాశం ఇవ్వరు.. మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరో పించారు. ఇనుప కంచెలు తీసివేశామన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకు అన్నారు.

అనుమతి ఇస్తారా ? కంచెలు బద్దలు కొట్టాలా ? అని మండిపడ్డారు. అసెంబ్లీ లో గొంతు నొక్కడం, ఇక్కడా కూడా గొంతు నొక్కడమే నా ? అని ప్రశ్నించారు.

పోలీసులు అనుమతించక పోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు.