ఆసియాకప్‌లో సూపర్-4 దశలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు అదరగొట్టారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
విరాట్ కోహ్లీ (122 నాటౌట్; 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు),
కేఎల్ రాహుల్ లు(111 నాటౌట్; 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)
సెంచరీలతో విరుచుకుపడగా, ఓపెనర్లు రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) లు అర్థశతకాలతో సత్తా చాటడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముందు 357 పరుగుల లక్ష్యం నిలిచింది..