మహిళల టీ20 ఆసియాకప్‌ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది. స్మృతి మందానా సూపర్ హిట్టింగ్తో లక్ష్యం మరీ ఈజీ అయ్యింది. మందానా అజేయంగా 51 రన్స్ చేసింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం…శ్రీలంకను ఇండియా తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది.
రేణుకాసింగ్ ఠాకూర్ తన బౌలింగ్‌తో శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టింది. మూడు ఓవర్లలో కేవలం 5రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసింది. రాజేశ్వరి గయక్వాడ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక టీంలో రణవీర18 పరుగులు చేసిన టాప్ స్కోరర్‌గా నిలిచింది. మొత్తం ఎనిమిదిసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ఉమెన్స్ టీం..7 సార్లు కప్ ను కైవసం చేసుకుంది. 2004, 2005,2006 ,-2008, 2012, 2016,2022లో టీమిండియా కప్ కొట్టింది…