ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ..!

ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు ఉత్తమ గౌరవంగా ‘ఆస్కార్’ అవార్డు ను భావిస్తారు… అమెరికా కేంద్రంగా ఇచ్చే ఈ ఆస్కార్ అవార్డు ఒక్కసారి వస్తే వారి లైఫ్ మారిపోతుంది..అంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఆస్కార్ అవార్డు. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్కార్ కు చాలా సినిమాలు ఇండియా నుండి అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఆ చిత్రాలలో బలగం, దసరా, ది కేరళ స్టోరీ, గద్దర్ 2, విడుదలై 1, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ లాంటి కొన్ని చిత్రాలు ఆస్కార్ బరిలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ వీటిలో ఎన్ని సినిమాలు ఆస్కార్ ను మెప్పించి నామినేషన్ కు అర్హత సాధిస్తాయి అన్నది తెలియాల్సి ఉండగా, తెలుగు నుండి శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మరియు కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన అచ్చం తెలంగాణ యాసతో తెరకెక్కిన బలగం దరఖాస్తు చేసుకున్నాయి…
మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తోంది. ఆస్కార్స్ 2024 కోసం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ‘ది స్టోరీ టెల్లర్’ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), ట్వల్త్ ఫెయిల్ (హిందీ), ఘూమర్ (హిందీ), ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, ‘జ్విగాటో’, ‘ది కేరళ స్టోరీ’తో పాటు తమిళం నుంచి ‘విడుదలై పార్ట్-1’, తెలుగు నుంచి ‘దసరా’, ‘బలగం’ ఉన్నాయట.

ఈసారి ఆస్కార్స్ ఎంట్రీ రేసులో ‘వాల్వి’ (మరాఠీ), ‘గదర్ 2’ (హిందీ), ‘అబ్ తో సబ్ భగవాన్ భరోస్’ (హిందీ), ‘బాప్ లాయక్’ (మరాఠీ) తదితర చిత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ‘బలగం’ మూవీ ఆస్కార్ ఎంట్రీ సాధించే ఛాన్సులు అధికంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ మూవీకి ‘జ్విగాటో’, ‘విడుదలై పార్ట్-1’ నుంచి తీవ్ర పోటీ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హృదయాలను మెలిపెట్టేలా భావోద్వేగాలను పంచిన ‘జ్విగాటో’ మూవీ ‘బలగం’కు సవాల్ విసురుతోందట. మరి.. ఈసారి ఆస్కార్స్కు భారత్ నుంచి ఏ చిత్రాన్ని పంపుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

మరి ఈ రెండూ నామినేషన్స్ కు అర్హత సాధిస్తాయా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.