5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల..ఎగ్జిట్ పోల్స్…

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల.. ఎగ్జిట్​ పోల్స్​ వచ్చేశాయి. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి..చేసుకోవచ్చని పేర్కొన్నాయి. ఇక మిజోరంలో స్థానిక పార్టీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతున్నాయి.

Assembly Elections Exit Poll Results 2023 LIVE : దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణా, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ల్లో భాజపా అధికార పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

మిజోరం విషయానికి వస్తే.. జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని స్పష్టం చేశాయి.

ప్రస్తుతానికి…
ప్రస్తుతానికి మధ్యప్రదేశ్లో భాజపా; ఛత్తీస్గఢ్, రాజస్థాన్ల్లో కాంగ్రెస్; తెలంగాణలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. మిజోరంలో MNF పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కానీ, తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీకే పట్టం!
Madhya Pradesh Election Exit Poll Results 2023 :మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోవచ్చని అంటున్నాయి. అంటే మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తోంది.

రాజస్థాన్ రాష్ట్రంలో CVoter Exit Poll ఫలితాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కేవలం 81 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంగా మిగిలుతుందని తేల్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పుంజుకుంటుందని వెల్లడించింది.గత ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 104 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసింది. ఇక బీఎస్పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకోగా ఈ సారి కనీసం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది.కాంగ్రెస్ కి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది…

మిజోరం ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర Exit Poll వచ్చింది.మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్న మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 18కి పడిపోయే అవకాశముందని అంచనా వేసింది Cvoter సర్వే. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోగా ఈ సారి కూడా ఆ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చేసింది. ఇక ZPM పార్టీ గత ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించగా ఈసారి 15 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని చెప్పింది. ఇతరులు 1-2 స్థానాలకు పరిమితమవుతారని వెల్లడించింది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 41-53 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది Cvoter సర్వే. బీజేపీ 36-48 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్ 68 స్థానాలు గెలవగా ఇప్పుడు 47 సీట్లకే పరిమితం కానుంది. బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి…

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్

పార్టీ గెలిచే స్థానాలు
కాంగ్రెస్ 80
బీజేపీ 138
ఇతరులు 12
సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్

పార్టీ గెలిచే స్థానాలు
కాంగ్రెస్ 92
బీజేపీ 128
ఇతరులు 10
CSDS ఎగ్జిట్ పోల్స్

పార్టీ గెలిచే స్థానాలు
కాంగ్రెస్ 72
బీజేపీ 141
ఇతరులు 17
ఏబీపీ-నీల్సన్ ఎగ్జిట్ పోల్స్

పార్టీ గెలిచే స్థానాలు
కాంగ్రెస్ 80
బీజేపీ 138
ఇతరులు 12
రాజస్థాన్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ!
Rajasthan Election Exit Poll Results 2023 :రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అంటే రాజస్థాన్లో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఈసారి కూడా అధికార మార్పిడి జరగవచ్చని పేర్కొన్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అధికారం రానుందని వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..

Dainik Bhaskar Exit Polls

భాజపా 98-105
కాంగ్రెస్‌ 85-95
ఇతరులు 10-15
ఛత్తీస్గఢ్లో మళ్లీ కాంగ్రెస్కే అధికారం!
Chhattisgarh Election Exit Poll Results 2023 : కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఎగ్జిట్ పోల్స్ సంస్థ అంచనాలు ఇలా..

ఏబీపీ న్యూస్‌ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది.
జన్‌కీబాత్‌ అంచనా ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది.
సంస్థ ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌ యాక్సిస్‌ మైఇండియా టీవీ5 న్యూస్ పీపుల్స్‌ పల్స్‌
పార్టీ / సీట్లు
కాంగ్రెస్‌ 46-56 40-50 54-66 54-64
బీజేపీ 30-40 36-46 29-39 29-39
ఇతరులు 3-5 1-5 0-2 0-2
తెలంగాణలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ!
Telangana Election Exit Poll Results 2023 : తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని పేర్కొన్నాయి. ఓల్డ్ సిటీలో AIMIM హవా చూపిస్తుందని, భాజపా మాత్రం పూర్తిగా చతికిల పడిందని తెలిపాయి.

CNN IBN Exit Polls 2023 : సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్.. బీఆర్‌ఎస్‌ 35 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 65 నుంచి 70 సీట్ల వరకు, బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు 1 లేదా 2 స్థానాలు గెలవవచ్చని పేర్కొంది.

AARAA Exit Polls 2023 : ఆరా మస్తాన్‌ ప్రీ పోల్‌ సర్వే.. అధికార బీఆర్ఎస్ 41 నుంచి 49కి మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 58 నుంచి 67 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది. ఇక బీజేపీ 5 నుంచి 7, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావొచ్చని తెలిపింది. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు 39.58 శాతం, కాంగ్రెస్కు 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది. కామారెడ్డిలో బీజేపీ గెలిచే అవకాశముందని.. సీఎం కేసీఆర్‌ రెండో స్థానంలో ఉండొచ్చని చెబుతోంది…

Jan ki Baat Exit Polls 2023 : జన్‌కీబాత్‌ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌ 48 నుంచి 64 చోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. అధికార బీఆర్ఎస్ 40 నుంచి 55 స్థానాల్లో గెలవొచ్చని చెబుతోంది. అలాగే బీజేపీ 7 నుంచి 13 నియోజకవర్గాలు, మజ్లిస్‌ పార్టీ 4 నుంచి 7 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది.

Chanakya Strategies 2023 : చాణక్య స్ట్రాటజీస్‌.. కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యత సాధించబోతుందని అంచనా వేసింది. 67 నుంచి 78 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ గెలవబోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ 22 నుంచి 31 చోట్ల, బీజేపీ 6 నుంచి 9 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.

Peoples Pulse Exit polls 2023 : పీపుల్స్‌ పల్స్‌, సౌత్‌ ఫస్ట్‌ సర్వేలు.. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 62 నుంచి 72 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 35 నుంచి 46 సీట్లు రావొచ్చని.. మజ్లిస్‌ పార్టీ 6 నుంచి 7, బీజేపీ 3 నుంచి 8 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి.