ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహుర్తం ఖారారు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, పలువురు మాజీ ఎమ్మెల్యేలు చనిపోయినందున, 16వ తేదీన వారి మృతి పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత, ఆ రోజంతా సమావేశాలు వాయిదా పడనున్నాయి..17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం అనంతరం 18వ తేదీకి సభ వాయిదా పడనుంది. 18వ తేదీన ఆర్థికమంత్రి హరీశ్‌రావు రానున్న ఆర్థిక సంవత్సరానికి(2021-22) సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ్యులంతా దీనిని అధ్యయనం చేసేందుకై 19వ తేదీన సమావేశాలకు సెలవు ప్రకటించి, 20వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చలు మొదలుకానున్నాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రూపకల్పనపై చర్చించారు. ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకున్నారు…