గ్రహాల పుట్టుక గుట్టును విప్పే తారా ధూళి..!

గ్రహాల పుట్టుక గుట్టు విప్పిన తారా ధూళి..కెంగో తాచిన్‌బానా.గ్రహాల పుట్టుక గుట్టును విప్పే తారా ధూళి.

గ్రహాల పుట్టుక గుట్టును విప్పే తారా ధూళి

సూర్యుడి కన్నా కొంచెం పెద్దగా ఉండే అసింప్టోటిక్‌ జయింట్‌ బ్రాంచ్‌ (ఏజీబీ) నక్షత్రాల నుంచి వచ్చే ధూళిని విశ్లేషించడం ద్వారా గ్రహాల పుట్టుకకు సంబంధించిన గుట్టును విప్పొచ్చని జపాన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటి వెలుగుల్లోని వైరుధ్యాలను గమనించడం ద్వారా దీని సాధించొచ్చని వివరించారు. ఏజీబీ తారలు భార మూలకాలను వెదజల్లుతుంటాయి. అవి ధూళి రూపంలో పోగుపడుతుంటాయి. రెండు నక్షత్రాల మధ్య ఉండే ఇంటర్‌స్టెల్లార్‌ ప్రదేశంలో అవి చేరుతుంటాయి. అది గ్రహాల పుట్టుకకు దారి తీయవచ్చు. అందువల్ల వీటి గురించి అధ్యయనం చేయడం ద్వారా గ్రహాలు, భూమిపై జీవం వంటి అంశాల గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తారలు వెదజల్లే కాంతిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటి నుంచి వెలువడే పరారుణ కాంతి చాలా కీలక సమాచారాన్ని అందిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన కెంగో తాచిన్‌బానా పేర్కొన్నారు.