మైనర్ బాలికపై అత్యాచారం ఆపై హత్య…..

పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య...!!!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో దారుణం జరిగింది.

పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది మైనర్ బాలిక. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బాలికను వివస్త్రను చేసి హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు పోలీసులు..పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గ్రామంలో నీటి సమస్య ఉండటం వలన ఇంట్లో నుండి ఇ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు నగర శివారు ఖాళీ ప్రదేశాలకు వస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఖాళీ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ఆడపిల్లలను వేధిస్తున్నారు ఆకతాయిలు. గతంలో సమస్యకు సంబంధించి అధికారులకు ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు…ఈ ఘటనకు పాల్పడిన ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు అంటున్నారు. ఇంట్లో నుండి ఇ పిల్లలను బయటకు పంపించాలంటే భయం వేస్తోందంటున్నారు. స్కూలుకు వెళ్లేటప్పుడు బెదిరిస్తున్నారని కొంతమంది ఆడపిల్లలు చెబుతున్నారు. దీంతో తమ పిల్లలను బయటకు పంపించాలి అంటే భయమేస్తోందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. గతంలో బాత్రూంలు, నీటి సమస్య సంబంధించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు…

వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపినా వివరాల ప్రకారం..…15 ఏళ్ల మైనర్ బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. బాలిక మృతి చెందినట్లు గుర్తించాం. అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తారలించాం. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.