ఆడియో టేపులు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపిన పోలీసులు..!!

*ఆడియో టేపులు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపిన పోలీసులు..*

బీజేపీ నేతలు, స్వామీజీలు టీఆర్‌ ఎస్ ఎమ్మెల్యేలతో సాగించిన బేరసారాలకు సంబంధించిన
ఆడియో టేపులను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపిన పోలీసులు..

శనివారం మరికొన్ని ఆడియో, వీడియోలు వెలుగులోకి వచ్చే అవకాశం

ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాక కీలక నిర్ణయం తీసుకోనున్న పోలీసులు..

*ఎమ్మెల్యేలకు ఎర కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్న పోలీసులు…*

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పేర్కొన్న పోలీసులు

నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు

హాల్ లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు: పోలీసులు

ఫాంహౌజ్ హాళ్లో మ.3.05కి రహస్య కెమెరాలు ఆన్ చేశాం: పోలీసులు

మ.3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారు: పోలీసులు

సా.4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారు: పోలీసులు

సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు: పోలీసులు

మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పాం: పోలీసులు

కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లాం: పోలీసులు

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైంది: పోలీసులు

కర్ణాటక, దిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయింది: పోలీసులు

తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లు రికార్డయింది: పోలీసులు

తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారు: పోలీసులు

ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పొందుపరిచిన పోలీసులు

రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీ్న్ షాట్లు పొందుపరిచిన పోలీసులు

25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటు “సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పొందుపరిచిన పోలీసులు

నందు డైరీలో 50 మంది తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయి: పోలీసులు.

మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారు: పోలీసులు.