ఆస్ట్రేలియాపై అఫ్గ‌నిస్థాన్ (Afghanistan) సంచ‌ల‌న విజ‌యం.!

టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం..

అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన చేస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ సూపర్-8లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది…

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అనూహ్యంగా రాణిస్తున్న‌ అఫ్గ‌నిస్థాన్ (Afghanistan) సంచ‌ల‌న విజ‌యంతో సెమీఫైన‌ల్ బ‌రిలో నిలిచింది. సూప‌ర్ 8 తొలి పోరులో భార‌త్ చేతిలో చావుదెబ్బ తిన్న కాబూలీ టీమ్ ఆదివారం మాజీ చాంపియ‌న్ ఆస్ట్రేలియా (Australia)పై సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. దాంతో, గ్రూప్ 1 పాయింట్ల ప‌ట్టిక‌లో ర‌షీద్ ఖాన్(Rashid Khan) నేతృత్వంలోని అఫ్గ‌న్ మూడో స్థానంలో నిలిచింది. దాంతో, స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా మారిపోయాయి….

పదునైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు అఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 19.2 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమేచేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఫలితంగా 21 పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై గెలవడం అఫ్గాన్ జట్టుకు ఇదే తొలిసారి కావటం గమనార్హం.

149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా లక్ష్య చేధనలో విఫలమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మ్యాక్సివెల్ (59) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగుల రాబట్టడంలో విఫలమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్ గుల్బాడిన్ నైబ్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. మరోబౌలర్ నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టించారు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 21 పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే తొలిసారి..
ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు సంచలన విజయంతో గ్రూప్-1 నుంచి సెమీఫైనల్ కు ఏరెండు జట్లు వెళ్తాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. ఆసీస్, అఫ్గాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయి.. ఈనెల 25న ఉదయం 6గంటలకు (భారత కాలమానం ప్రకారం) బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే భారత్ జట్టుతో పాటు సెమీస్ కు అఫ్గాన్ చేరుతుంది..