ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం..

ఆస్ట్రేలియా 125 ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 126 నూ చేదించింది..

టి20 ప్రపంచకప్‌ 2021లో ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 11.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 72 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆసీస్‌ బౌలర్లను వెంటాడి వేటాడి మరి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెటించడు. ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే సెమీస్‌లో అడుగుపెడుతుంది.ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి ఆసీస్‌ బ్యాటర్స్‌ బెంబెలెత్తిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేక నానా అవస్థలు పడింది. ఆరోన్‌ ఫించ్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్‌ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 3, టైమల్‌ మిల్స్‌, క్రిస్‌ వోక్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు…
ఆస్ట్రేలియా నిర్ధేశించిన అతి త‌క్కువ ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ సింపుల్‌గా ఛేదించేసింది. 11.4 ఓవ‌ర్ల‌లోనే ఇంకా 50 బంతులు మిగిలి ఉండ‌గానే 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించింది. ఇంగ్లండ్‌ను జోస్ బ‌ట్ల‌ర్ అల‌వోక‌గా గెలిపించాడు..