శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం…

డేవిడ్‌ వార్నర్‌(65;42 బంతులు) మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 18 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. పించ్‌, వార్నర్‌లు కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు పునాది వేశారు. ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌ ఔటైన తర్వాత వార్నర్‌ జోరు చూపగా.. స్మిత్‌ 28 పరగులు నాటౌట్‌ రాణించాడు. ఇక చివర్లో మార్కస్‌ స్టోయినిస్‌ 7 బంతుల్లో 16 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా సూపర్‌ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు తీశాడు.