వెస్టిండీస్‌పై ఆసిస్‌ భారీ విజ‌యం..

వెస్టిండీస్‌పై ఆసిస్‌ భారీ విజ‌యం..
చెలరేగి ఆడినా వార్నర్..
56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు..

T20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో జరిగిన పోరులో ఆసీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ తో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 158 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా…16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.మునుపటి ఫామ్ అందుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 9 పరుగులకే అవుట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ 53 పరుగులు చేశాడు.ఈ విజయంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా, సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ 4 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది.