నాల్గో టెస్టు మ్యాచ్‌కి వర్షం అంతరాయం..అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369….. భారత్ 62/2 పరుగులు…..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369…..
భారత్ 62/2 పరుగులు…..

బ్రిస్బేన్‌: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. చివరి నాల్గో టెస్టు మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిలిచిపోయింది. అప్పటికి భారత్ 62/2 పరుగులు చేసింది…. క్రీజ్‌లో ఛెతేశ్వర్‌ పుజారా(8), అజింక్య రహానె(2) క్రీజులో ఉన్నారు. ఇన్ని్ంగ్స్ ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌(7) వికెట్‌ కోల్పోయింది..తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 274/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్ శుభ్‌మన్ ‌ గిల్ ‌(7) వికెట్‌ కోల్పోయింది. పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్ శర్మ ‌(44; 74 బంతుల్లో 6×4), ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆపై వేగం పెంచి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.