వినూత్న ఆవిష్కర్తలకు ‘ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021’ అవార్డుల ప్రధానం..

*వినూత్న ఆవిష్కర్తలకు ‘ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021’ అవార్డుల ప్రధానం*

దేశవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన పది మంది ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్‌ అవార్డులు అందుకున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టైమ్స్ ఫర్ ఇండియా మరియు గ్లోబల్ శాల సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ పోటీలు-2021 ని నిర్వహించాయి. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన 450 ఆవిష్కరణలు పోటీలో నిలవగా, అత్యద్భుతమైన ఆవిష్కరణలుగా నిలిచిన ‌మొదటి 10 మందికి నిర్వాహకులు అవార్డులు అందజేసారు. హైదరాబాద్ కు చెందిన అవినాశ్ గండి, ఇతర రాష్ట్రాలకు చెందిన గౌరవ్ నరుల, దర్శన్ ఎమ్, రాహుల్ పాటిల్, గణేష్ డి.ఎన్, మంజునాథ్ డి, మృత్యుంజయ డి.కె, మురళీకృష్ణ కె, మలలూర్ వి అహిపతి, రుబిని పుల్లైడి, సుచన్ ఖడే, జితేష్ కుమార్ యాదవ్, సంజన్ పిబి, మెర్విన్ మాథ్యూస్, కాంచన ఖతన, శంషాంక్ ఎస్ కాంబ్లె, దృష్టి హన్స్ లు ఆవిష్కరణలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, కొత్త తరహా ఆవిష్కరణలు చేసిన మొదటి 30 మంది గ్లోబల్ షాల నుండి స్కాలర్ షిప్ లను అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ వినయ్ దబోల్కర్, టైమ్స్ ఫర్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి అనురాధ వల్లూరి, గ్లోబల్ షాల ప్రతినిధి అనన్య కుమార్, ఏఐఫ్ ప్రతినిధి సాయి చంద్ర శేఖర్ పాల్గొన్నారు.

*కరోనా వైరస్ ను అరికట్టేందుకు అవినాష్ వినూత్న ఆవిష్కరణ*

హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్స్ ఇంజనీర్ అవినాష్ గండి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్మార్ట్ అల్ట్రా జెర్మీసిడల్ ఇర్రాడియేషన్ డివైస్ – ఇన్ఫినిటీ 360 ను రూపొందించారు. ఈ పరికరం కరోనా వైరస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

వివిధ వాట్ల, ఎనిమిది యువి-రే ఉద్గార లైట్లను కలిగి ఉన్న ఈ పరికరం ఒక నిమిషం నుండి ఐదు నిమిషాల్లో ఒక గదిని క్రిమిసంహారక చేస్తుంది‌. మొబైల్ అనువర్తనంతో దీన్ని ఆన్ చేయవచ్చు, తద్వారా ఎవరూ నేరుగా UV కాంతికి గురికాకుండా ఉంటారు. మానవ కదలికను గుర్తించడానికి దీనికి నాలుగు సెన్సార్లు ఉంటాయి. ఏదైనా కదలిక ఎదురైతే ప్రమాదకర UV కిరణాలు మనిషి మీద పడకుండా స్విచ్ ఆఫ్ అవుతుందని వివరించారు.