అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు….

కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం రామ్ లల్ల విగ్రహం మరియు రామాలయంలోని భక్తుల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ లల్లా విగ్రహానికి గులాల్ పూశారు. భక్తులు స్వామివారికి ధూపదీపాలను సమర్పించే పవిత్రమైన రోజు కావడంతో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మార్చి 24 మరియు 25 తేదీలలో దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని జరుపుకుంటారు.

రామజన్మభూమి ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర ఈ విషయాన్ని తెలిపారు. “ఈసారి మేము హోలీని గొప్పగా, పవిత్రంగా మరియు అంకితభావంతో జరుపుకుంటాము. ఈ సంవత్సరం హోలీ అద్భుతంగా ఉంటుంది. రామ్ లాల్లాకి గులాల్ పూస్తాం. గుజియా, హల్వా వంటి ప్రముఖ వంటకాలను నైవేద్యం గా పెడతాము. పండుగ సీజన్ కావడంతో వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు’’ అని తెలిపారు.