పార్టీలకి పబ్బులకైతే పోతారు,,ధోని, విరాట్‌, రోహిత్‌ల తీరు సరికాదు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పాల్గొనే,అంత టైమ్‌ కూడా మీకు లేదా…!?

రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏండ్ల తర్వాత రాముడు తన రాజ్యానికి తిరిగొచ్చాడంటూ దేశ ప్రజలంతా పండుగ జరుపుకుంటున్నారు..బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలోని రామజన్మతీర్థ నిర్వాహకులు అతికొద్దిమందికి మాత్రమే ఆహ్వానాలు పంపారు. ప్రధాన మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, రవీంద్ర జడేజా, మిథాలీ రాజ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ టీమిండియా దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోని, తాజా సారథి రోహిత్‌ శర్మలు ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో నెటిజన్లు ఈ ఇద్దరితో పాటు విరాట్‌ కోహ్లీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడ్‌ షూట్స్‌, పార్టీలు, పబ్బుల వెంట తిరిగే వీళ్లకు దేశం పండుగలా జరుపుకుంటున్న కార్యక్రమానికి వచ్చే తీరిక లేదా..? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు..
నెటిజన్‌ స్పందిస్తూ… ‘ధోని, విరాట్‌, రోహిత్‌ల తీరు సరికాదు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉండేదే ఐదారు గంటలు. అంత టైమ్‌ కూడా మీకు లేదా..? యాడ్స్‌, పార్టీలకు వెళ్లడానికి మీ దగ్గర టైమ్‌ ఉంది గానీ ఇటువంటి ప్రోగ్రామ్స్‌కు మాత్రం రాలేరా..?’ అని కామెంట్‌ చేశాడు. మరొకరు.. ‘మీకు మీరు తోపులు అనుకుంటున్నారా..? లేక అంబానీ కంటే గొప్పవాళ్లం అనుకుంటున్నారా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు..