ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆర్మీ హెలికాప్టర్లతో పూలవర్షం..!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆలయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు.

దీంతోపాటు శ్రీరాముడికి హారతిచ్చే సమయంలో 30 మంది కళాకారులు వివిధ భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తుంటే అతిథులందరూ స్వయంగా గంటలను మోగిస్తారని అధికారులు చెబుతున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన అనంతరం హాజరైన వారిని దర్శనానికి క్యూలో పంపిస్తున్నారు..