అయోధ్యలో కన్నుల పండుగగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట..

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నగర సంకీర్తనలు, భజనలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టను రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలా ఘనంగా జరుపుకుంటున్నారు..
దారులన్నీ అయోధ్య వైపే, చూపులన్నీ బాలరాముడి మీదే అన్నట్లుగా రాజకీయ ప్రముఖుల నుండి సినీ, క్రీడా రంగ సెలబ్రేటిస్ వరకు అందరు “జై శ్రీ రామ్” నినాదంతో అయోధ్యకు చేరుకున్నారు.

అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితులు జరిపించారు.

.సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒంటిగంటకు ముగిసింది. అంనతరం మధ్యాహ్నం 1:20 గంటలకు వరకు ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు… ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల, క్రీడారంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని యజమానిగా వ్యవహరించగా.. మోడీ పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు…