అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నిర్ణయం..!.

*అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నిర్ణయించారు.. ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఓ ప్రకటన ద్వారా *వెల్లడించారు. జనవరి 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్/భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు…

“అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయం ప్రాణప్రతిష్ఠకు హాజరుకావాలని కోరుతూ గత నెల మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. మన దేశంలో రాముడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ *ఆర్ఎస్ఎస్/బీజేపీ కలిసి అయోధ్య రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్‌గా మార్చారు. ఎన్నికల్లో లబ్ధి కోసమో ఇంకా నిర్మాణం పూర్తికాకముందే అయోధ్య ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభిస్తున్నారు.* అయోధ్య కేసులో సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును, దేశంలోని కోట్లాది మంది రామ భక్తుల మనోభవాలను గౌరవిస్తూనే ఈ ఆహ్వానాన్ని ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్..