ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ‘గోల్డ్‌ కార్డు…

R9TELUGUNEWS.COM.
రవీంద్రభారతి: ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ‘గోల్డ్‌ కార్డు’ ఇస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరిస్తే తెలంగాణలోనూ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్డు ద్వారా దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్లోబల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌(జీహెచ్‌ఆర్‌ఏ), రాష్ట్ర ప్రగతి దివ్యాంగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జీహెచ్‌ఆర్‌ఏ వ్యవస్థాపకులు డా.బాబు మిరియం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…