బాబా వంగా చెప్పినా 2023 జోతిష్యం ..ఈ ఏడాదిలో జరగబోయే ఐదు కీలక విషయాలు..!!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాబా వంగా చెప్పిన అనేక అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం నుంచి 1996లో మరణించే వరకు బాబా వెంగా చాలా ప్రసిద్ధి చెందారు..బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక బాబా వెంగా ప్రతి సంవత్సరం ఏ జరగబోతుందో ముందే అంచనా వేశారు. ఆయన 2022 కోసం కొన్ని అంచనాలు వేయగా నిజమైనట్లు ఆయన శిష్యులు చెబుతున్నారు. తాజాగా బాబా వెంగా కూడా 2023 గురించి కొన్ని అంచనాలను ముందే చెప్పారు. అవి ఎంత నిజమో.. ఎంత అబద్ధమో ఈ ఏడాదిలో తేలిపోనుంది. ఈ ఏడాదిలో జరగబోయే ఐదు కీలక విషయాలు..

సౌర తుఫాను రావచ్చు..!!

బాబా వంగా ప్రకారం.. 2023 సంవత్సరంలో ఒక పెద్ద ఖగోళ సంఘటన ఉంటుంది. సౌర తుఫాను సంభవించవచ్చు. ఇది భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా భూమి కక్ష్య మారవచ్చు. ఈ ఖగోళ సంఘటన వల్ల అనేక ఇతర తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు. ఇది నిజమైతే ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంటుంది…

గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చే అవకాశం..!

గ్రహాంతరవాసులు భూమిపైకి రావచ్చని బాబా వంగా అత్యంత భయానక అంచనా వేశారు. ప్రపంచం చీకటితో కప్పబడి పోవచ్చు. ఈ ఏడాది గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తే లక్షలాది మంది చనిపోతారని ఆయన ముందే చెప్పారు.

అత్యంత శక్తివంతంగా పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని స్థాపించే అవకాశం ఉందని బాబా వంగా పేర్కొన్నారు. పుతిన్ ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి కావచ్చని అంచనా వేశారు. రష్యా మొత్తం ప్రపంచాన్ని పాలిస్తుందన్నారు…

జీవ ఆయుధాల ముప్పు

బాబా వంగా అంచనాల ప్రకారం ఈ ఏడాది జీవ ఆయుధాల ప్రమాదం ఉంది. అయితే ఈ దాడి ఎవరు.. ఎవరిపై చేస్తారనే దానిపై ఇంకా స్పష్టంగా చెప్పలేదు.

పిల్లలు ల్యాబ్‌లో పుట్టవచ్చు..(కృత్రిమ గర్భధారణ)

2023 సంవత్సరంలో ల్యాబ్‌లో పిల్లలు పుట్టవచ్చు బాబా వంగా జోస్యం చెప్పారు. ల్యాబ్‌లో పిల్లలను సృష్టించే ప్రక్రియ తర్వాత.. వారి చర్మం రంగు, లింగాన్ని కూడా నిర్ణయిస్తారని అంచనా వేశారు.

బాబా వెంగా తన కళ్లతో చూడలేని ఫకీరు. ఆయన బల్గేరియా నివాసి. ఆయన 1911లో జన్మించారు. 12 ఏళ్ల వయస్సులో ఆయన కంటి చూపును కోల్పోయారు. ఆయన అంచనాలలో 85 శాతం నిజమైనట్లు ప్రచారం ఉంది. అయితే ఆయన చెప్పిన వాదనలు చాలా తప్పు అని కూడా నిరూపితమమయ్యాయి. బాబా వంగా చెప్పిన అంచనాలు ఎక్కడా రాయలేదని..