బాబా వంగా, మాటలు నిజమవుతున్నాయి..!!

బాబా వంగా గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త అంచనా వేసిన భవిష్యత్ సంఘటనలు నిజమవుతున్నాయి..2024లో ఆమె అంచనా వేసిన సంఘటనలు నిజమవుతున్నాయి… నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలిచే బాబా వంగా, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు మరియు బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే అంచనా వేశారు. తాజాగా ఆమె అంచనా వేసినట్లు 2024లో జపాన్, యూకే వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ని కనుగొనడాన్ని కూడా ఆమె అంచనా వేసింది..
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్:

రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్ రూపొందించడానికి దగ్గరగా ఉన్నట్లు ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ”మేము కొత్త తరానికి చెందిన క్యాన్సర్ వ్యాక్సిన్లు మరియు ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ అని పిలవబడే వ్యాక్సిన్‌కి చాలా దగ్గరగా వచ్చాము” అని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రతిపాదిత వ్యాక్సిన్ ఏమే క్యాన్సర్లను లక్ష్యంగా చేసుకుంటుందో చెప్పలేదు…

ఆర్థిక సంక్షోభంలో
అగ్రరాజ్యాలు:

2024లో పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం చాలా ఉంది. అప్పులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరడం వంటి వాటి కారణంగా జపార్, యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ గత రెండు త్రైమాసికాల్లో కుచించుకుపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023 చివరి మూడు నెలల్లో దేశ జీడీపీ 0.4 శాతం తగ్గింది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్, జర్మనీ తర్వాత 4వ స్థానానికి పడిపోయింది. ఇక యూకే గత ఏడాది చివర్లో మాంద్యంలో కూరుకుపోయింది.
బాబా వంగ జోస్యాలు:

*యూరప్ ఉగ్రదాడుల గురించి హెచ్చరించింది.
*వచ్చే ఏడాది ”పెద్ద దేశం” జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడులు నిర్వహిస్తుందని సూచించింది.
* ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భయంకరంగా మారుతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
* సైబర్ దాడులు గురించి అంచనా వేశారు. పవర్‌గ్రిడ్స్, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు. జాతీయ భద్రతకు ముప్పు
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సొంత దేశస్థుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె అంచనా వేసింది.
* క్వాంటం కంప్యూటింగ్‌లో అతిపెద్ద పురోగతిని అంచనా వేసింది..