భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్…గోదారమ్మకు శాంతి పూజలు..

సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ నిర్వహించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు.ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.