భద్రాచలంలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ…

*.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు..

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నుంచి 9,92,794 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు…