బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి సుధ భారీ విజయం సాధించారు. 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం..

బద్వేలులో ఊహించిందే జరిగింది. సంచలనాలను ఆశించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది.

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,089 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు…బద్వేల్‌లో లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారీ మెజారిటీ దిశగా వైసీపీ దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యం పెరిగిపోతూ వచ్చింది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్లు… రెండో రౌండ్‌లో 8,300 ఓట్లు… మూడో రౌండ్‌లో 7,879 ఓట్లు… నాలుగో రౌండ్‌లో 7,626 ఓట్లు… ఐదో రౌండ్‌లో 9,986 ఓట్లు… ఆరో రౌండ్‌లో 9,443 ఓట్లు… ఏడో రౌండ్‌లో 8,741 ఓట్ల ఆధిక్యం లభించింది…2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి వెంక‌ట సుబ్బ‌య్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా దాస‌రి సుధ‌ను ఎంపిక చేసింది.