కడప జిల్లా బద్వేల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధా, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళితులను కించపరిచేలా లోకేష్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు. లోకేష్ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో నాలుగు రోడ్ల కూడలి మీదుగా ప్రకాశం జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నారు. దీంతో.. చంద్రబాబు వెళ్లే రహదారిని వైసీపీ శ్రేణులు నిర్బంధించాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోనళకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.