అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు..

అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా మాల ధారణ చేసుకున్న భక్తులు ఆగ్రహానికి గురయ్యారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింద లింక్ ని ఓకే చేయండి.
https://youtu.be/4Df8CFUJyvQ.

రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌లో స్వాములు ప్రదర్శన నిర్వహిస్తూండగా. బైరి నరేష్ అనుచరుడు ఒకరు వీడియో తీశారు. అదే సమయంలో బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా స్వాములతో వాదనకు దిగారు. దీంతో స్వాములు కోపోద్రిక్తులై అతనిపై దాడి చేశారు. పోలీసులు అతన్ని విడిపించి.. స్టేషన్‌కు తరలించారు.

వికారాబాద్

153ఏ, 295ఏ,, 298, 505 సెక్షన్ కింద బైరి నరేష్ పై కేసు నమోదు..చేసిన వికారాబాద్ పోలీసులు….

స్థానికుల సమాచారం మేరకు… అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, మరోచోట ఉంచి నట్లు సమాచారం….❗️

ఆయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వికారబాత్ పోలీస్ స్టేషన్లో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఫిర్యాదు..

త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

*బైరి నరేష్ పై దాడి అంటూ వైరల్ అవుతున్న వీడియో అబద్దం….*:

*వైరల్ వీడియో* : వికారాబాద్ లోని ఒక. యూట్యూబర్ నాగరాజుపై అయ్యప్ప భక్తుల దాడి కి సంబందించిన వీడియో గా సమాచారం….

అయ్యప్ప స్వాములు దాడి చేసింది బైరి నరేష్ పై అన్న ప్రచారం జరిగింది కానీ.. బైరి నరేష్ పై కాదని.. పోలీసులు చెబుతున్నారు. ఆయన అనుచరుడిపై దాడి జరిగిదంని అంటున్నారు. బైరి నరేష్ పోలీసుల అదుపులో ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహంతో ఉన్నందున.. బైరి నరేష్ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.