బలగం సినిమా ఓ కుటుంబాన్ని కలిపింది…

బలగం సినిమా ఆ కుటుంబాన్ని కలిపింది. 45 ఏండ్ల క్రితం విడిపోయిన వారందరినీ ఒక్కటి చేసింది.

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బాన్‌రెడ్డి-పోసక్క దంపతులకు మొత్తం ఆరుగురు సంతా నం. ఇంలదులో ఇద్దరు కొడుకులు, నలుగురు కూతు ళ్లు. మనుమలు.. మనమరాళ్లతో కలిసి ఆ కుటుంబ సభ్యులు మొత్తం 48 మంది. మంచిర్యాల, కరీంనగర్‌, జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లాల్లో వేర్వేరుగా నివాసముంటున్నారు. బాన్‌రెడ్డి పెద్ద కుమారుడు పుప్పిరెడ్డి బాపురెడ్డి, కోడలు సరోజన దంపతులు సీసీసీ నస్పూర్‌లో ఉంటున్నారు..వీరు ప్రత్యేక చొరవ తీసుకొని సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్న బంధువులందరితో మాట్లాడారు. ఆదివారం మంచిర్యాలకు రప్పించి బలగం సినిమా చూపించారు. పంతాలు, పట్టింపులకు పోయి బంధుత్వాలు దూరమైన విధానాన్ని ఈ సినిమాలో చూపించడంతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై అందరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సీసీసీ నుంచి మంచిర్యాలకు వెళ్లి ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. ఆటాపాటలతో సందడి చేశారు. బలగం సినిమా మా కుటుంబాన్ని ఒక్కటి చేసిందని, ఇలాంటి సినిమాలు తీస్తేనే సమాజంలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు..