హిందూపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: నందమూరి బాలకృష్ణ..

*హిందూపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: నందమూరి బాలకృష్ణ*

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి పేరు పెట్టాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

మౌనదీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

ప్రభుత్వం అర్ధరాత్రి హడావుడిగా జిల్లాలను ప్రకటిస్తూ జీవో జారీ చేసి, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని బాలకృష్ణ ఆరోపించారు.