యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…హీరో బాలకృష్ణ.. అఖండ సినిమా యూనిట్..

యాదాద్రి.. లక్ష్మీ నరసింహస్వామి .

హీరో బాలకృష్ణ….
……
R9TELUGUNEWS.COM..

యాదాద్రి ఆలయం
ఓ మహాద్బుతమని అన్నారు హీరో బాలకృష్ణ..
అఖండ సినిమా యూనిట్ ఇవ్వాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది…

ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను , సినిమా యూనిట్ తో కలిసి బాలకృష్ణ ప్రధానాలయ రాతి కట్టడాలను తిలకించారు…. యాదాద్రి ఆలయం మహాద్బుతమైన దివ్యక్షేత్రం గా రూపుదిద్దుకున్నదని ,ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుతున్నానని హీరో బాలక్రిష్ణ అన్నారు….
తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అని, తాను చిన్నపాటి నుంచి యాదాద్రి కి వస్తున్నాని కానీ ఇంత అద్భుతముగా ఆలయం అభివృద్ధి కావడం , ఈ ఆలయాన్ని తాను చూడటం పూర్వజన్మ సుకృతంగా భవిస్తున్నాని అన్నారు…
లక్ష్మీ నరసింహస్వామి స్వామి కృపతో తెలుగు రాష్టాల ప్రజలు సు:ఖ సంతోషాలతో ,సిరి సంపదలతో జీవించాలని ఆయన అన్నారు.. కరోనా మహమ్మరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారు ప్రజలందరినీ కాపాడాలని మొక్కుకున్నట్లు తెలిపారు.. ఆలయ eo గీత , ప్రధానార్చకులు ,అర్చక బృందం బాలకృష్ణ కు ఘనంగా స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందించి, వేద ఆశీర్వచనాలు చేశారు….