ఆగ్రహంతో బాలయ్య చెంపదెబ్బ…

ఆగ్రహంతో బాలయ్య చెంపదెబ్బ..

అభిమాని రియాక్షన్ ఇలా ఉంది..?
https://youtu.be/c969TvMtHe0విడియో చూడాలనుకుంటే… పైనా లింక్ ను ఓకే చేయండి…☝️☝️☝️

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమాని చెంప చెల్లుమనిపించారు. మూడు రోజులుగా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య.. శనివారం నాడు ఆమనలో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ నేత ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ సోము అనే బాలయ్య అభిమాని సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తుండగా.. బాలయ్య ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. సోము సెల్ ఫోన్ లాక్కుని చెంప చెల్లుమనిపించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలాఉంటే.. బాలయ్య కొట్టడంపై సదరు అభిమాను స్పందించాడు. ‘బాలయ్య నన్ను కొట్టాడని నేను అనుకోవడం లేదు. బాలయ్య నన్ను టచ్ చేశాడని ఫీల్ అవుతున్నాను. ఆయన నన్ను టచ్ చేసినందుకు గర్వకారణంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ఎవరికీ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. కానీ, నన్ను టచ్ చేశారు. అదే నాకు అమితానందం. వాస్తవానికి బాలయ్య మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నన్ను బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోశారు. అంతేతప్ప మరోటి కాదు. ఇలాంటి వాటిని మేం పట్టించుకోం. మేం బాలయ్య వీరాభిమానులం. స్వయంగా బాలయ్యే నన్ను టచ్ చేయడంపై సంతోషంగా ఉన్నాను.’ అంటూ బాలయ్య చేతి దెబ్బ తిన్న సోము ఓ వీడియోను విడుదల చేశాడు.