బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. రేపే వైసీపీ అభ్యర్థుల జాబితా…!

ఆంధ్రా రాష్ట్రం లో త్వరలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.క్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) ఎప్పటికప్పుడు నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేసి కొత్త వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే నాయకులను పక్కన పెట్టకు ముందు.. నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయకముందు సదరు నేతలను జగన్ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు.

ఇదే రకంగా నేడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivasa Reddy ) సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది. ఈ భేటి అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలలో తాను ఒంగోలు( Ongole ) నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలించాలని కూడా సీఎం జగన్ సూచించినట్లు తెలిపారు..
గిద్దలూరులో అన్నా రాంబాబు
( Anna Rambabu ) పోటీ చెయ్యకపోవటంతో ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది రేపు తేలుతుంది. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ రేపు పూర్తవుతుంది. అనంతరం సీఎం జగన్ పేర్లు ప్రకటిస్తారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది..