దేశవ్యాప్తంగా కూడా ఆదాయ వనరులని సంపాదించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థాయిలో ఉంది.మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్…
సూర్యాపేట జిల్లా..
నేరేడుచర్ల మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ను సన్మానించిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…
*అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ..*
దేశవ్యాప్తంగా కూడా ఆదాయ వనరులని సంపాదించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థాయిలో ఉంది…
గతంలో మత్స్యకారులు వారి జీవనం సాగించడంలో కొంత ఇబ్బంది పడడం జరిగింది ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో మత్స్యకారులకు నిధులు కేటాయించి వారి వ్యాపారానికి అవసరమైన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ని అందించడం జరిగిందని అన్నారు..
మత్స్యకారులు గతంలో పల్లెలను వదిలి పట్టణాలకు వలస పోయారని ప్రస్తుతం పట్టణాలకు వెళ్లిన వారంతా కూడా తిరిగి పల్లెబాట పట్టి మత్స్య సంపదపై దృష్టి సారించారు..
దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఒక రోల్డ్ మోడల్ గా నిలుస్తోంది…
బీసీ వర్గానికి 50 శాతం కంటే పైచిలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయడం జరిగింది..
రైతుబంధు లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఇంత పెద్ద ఎత్తున రైతులకు రైతుబంధు అందించడం జరుగుతుంది..
రైతులకు ఏదైతే అవసరమో ఒక రైతుగా సీఎం కేసీఆర్ కి మాత్రమే తెలుసు..
కులాలతో సంబంధం లేకుండా మత్స్యకారి వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కలిగించే అవకాశం త్వరలోనే కలుగుతుంది..
సముద్రం చేపలు తినడం కంటే మంచినీటిలో పెరిగిన చేపలకే దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది ఆరోగ్య కరమని కూడా ప్రజలు భావిస్తున్నారు..
300 కోట్లతో మత్స్యకారులకు వాహనాల అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దే..
*ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..*
ఉప ఎన్నికల్లో బండ ప్రకాష్ గారు ఎంతగానో తన గెలుపు కోసం కృషి చేశారని… అలాంటి మంచి వ్యక్తిని సన్మానించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు…
హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచార సమయంలో కూడా ప్రతి గ్రామం లో ప్రచారం చేసి గెలుపులో ముఖ్య భాగస్వామిగా అయ్యారు..
*ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..*
ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు అని..
వ్యక్తుల పట్ల మంచి గౌరవంతో మెలిగే వ్యక్తిని.. ఎన్నో ఏళ్లగా రాజకీయ అనుభవం కలిగిన వారికి సీఎం కేసీఆర్ అరుదైన గౌరవాన్ని కల్పించారని అన్నారు…