సహ విద్యార్థి పై దాడి కేసులో లొంగిపోయిన బండి భగీరథ…

సహవిద్యార్ధిపై దాడి చేసిన కేసులో బండి భగీరథ్ దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం పోలీసులు భగీరథ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే…మహీంద్రా విశ్వవిద్యాలయంలో సహ విద్యార్ధిపై దాడి చేసిన వీడియో వైరల్ గా మారడంతో యూనివర్శిటీ అధికారులు భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు భగీరథ్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 341, 323, 504, 506 r/w 34 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు…భగీరథ్ లొంగిపోవడంతో పోలీసులు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇదంతా కేసీఆర్ ఆడుతున్న రాజకీయ డ్రామాలో లో భాగమేనని భాజాపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.