పోలీసుల అదుపులో బండి సంజయ్..

గురువారం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ముందస్తుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.మునుగోడుకు వెళుతున్న బండి సంజయ్‌ కాన్వాయ్‌ని అడ్డుకొని అతన్ని అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిటర్నింగ్‌ క్యాంపు అధికారి ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది..