రైతులను, మహిళలను, నిరుద్యోగులను.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్న సీఎం కేసీఆర్…బండి సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. తెలంగాణలో హిట్ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారనితెలిపారు…. ఆ దిశగా సాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే నాలుగు విడతలను పూర్తి చేసుకుంది. అయితే ఐదో విడత బండి సంజయ్‌ పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేయడంతో హైటెన్షన్ నెలకొంది. బండి సంజయ్ సహా బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్టుతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే చివరికి హైకోర్టు అనుమతి, షరతులతో ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు టార్గెట్‌గా నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, టీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. మూడోరోజు నిర్మల్‌ జిల్లా భైంసా మండలం గుండెగావ్‌ నుంచి పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్.. గుండెగావ్‌లో పల్సికర్‌ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులతో సమావేశమయ్యారు. పత్తి చేనులో కూలి పనులు చేస్తున్న వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయలేదని, పెన్షన్లు ఇవ్వడం లేదని స్థానికులు బండి సంజయ్‌కు వివరించారు. పల్సికర్ ముంపు బాధితులు, స్థానికుల గోడు విన్న అనంతరం బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు…