కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్..

కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలా ల్లో యాత్ర కొనసాగిస్తాం అని వివరించారు. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం అని చెప్పారు…

అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 20 నుండి మలి విడత యాత్రకు చేపట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.