అమిత్ షా ,, ఈటెల భేటీపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు…

తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది….
తెలంగాణలో ఈటెల వైపే బిజేపి అంటు రాజకీయ టాక్ మొదలయింది… అయితే ఇదే విషయంపై బండి సంజయ్ కొంత క్లారిటీ ఇచ్చారు..
ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే వార్త జోరందుకుంది. ఈ క్రమంలో ఈటల అంశంపై సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అమిత్ షాను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలవడంలో తప్పేముందని అన్నారు. ఈటల,,అమిత్ షా భేటీపై అపార్థాలు సృష్టించడం సరికాదన్నారు. పార్టీలో జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ అందరికీ ఉందని ఉన్నారు. కేసీఆర్ పార్టీలో మాదిరిగా బీజేపీలో నియంతృత్వం ఉండదన్నారు. తమ పార్టీలో ఎవరు ఎవరినైనా కలిసే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో దందాలన్నీ టీఆర్ఎస్ నేతలే చేస్తున్నారని, టీఆర్ఎస్ అవినీతి పాలనను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మండి పడ్డారు.