సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ .

వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాల పర్యటన పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇంట్లో లొల్లి అయినప్పుడల్లా దేశ రాజకీయాల పేరుతో ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్.. హస్తినలో ఎవరూ పట్టించుకోవడంలేదని సటైర్ వేశారు. తనను కలవాలని నేతలను వేడుకుంటున్నాడని చురకలంటించారు. సీఎం ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు….
సీఎం కేసీఆర్‌ రూపొందించిన సినిమా అట్టర్‌ ఫ్టాప్‌ అయ్యిందని, ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా… కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో కొందరు ఐపీఎ్‌సలు రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం నిర్వహిస్తున్న ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం ఖాయమని వెల్లడవుతోందని, సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నిలదీస్తున్న ఉద్యమకారులను కుట్రదారులుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు…తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిపై మీడియాలో వస్తున్న కథనాలతో పాటు వారి ఇంటిపై జరిగిన దాడిని చూేస్త బాధేస్తోందని చెప్పారు. కాగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి డ్రైవర్‌ తిలక్‌ థాప గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండిసంజయ్‌ను కలిశారు. ఢిల్లీలో తనను పోలీసులు కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చిన తీరును సంజయ్‌కు ఆయన వివరించారు. ఈ కేసులో ప్రభుత్వ వ్యవహారంపై పార్టీ అధినాయకత్వానికి సంజయ్‌ నివేదించారు..