బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకున్న కార్యకర్తలు ఒక్కసారిగా ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు..!

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న సందర్భంగా బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకున్న కార్యకర్తలు ఒక్కసారిగా ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో అలా అనొద్దని వారికి సైగ చేసినా ఆపకుండా ‘సీఎం బండి సంజయ్’ అంటూ నినాదాలు చేశారు. కాగా, రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో నాలుగు రోజుల క్రితం బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం సూచన మేరకు ఆయన తన అధ్యక్షపదవికి రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. కాగా, బండి సంజయ్‌ను స్టేట్ చీఫ్‌గా తొలగించడంపై ఆ పార్టీ నేతలకు కొందకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.